బాబా సాహెబ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం

  • భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి అర్పించిన ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు
  • డాక్టర్.బి.ఆర్.బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరణ

నమస్తే శేరిలింగంపల్లి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ జయంతిని హఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ పరిధిలోని చందానగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల్లో ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, హఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, మియపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు.

డాక్టర్.బి.ఆర్.బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు

అనంతరం మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్, హరిజన బస్తి, గుట్టల బేగంపేట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్.బి.ఆర్.బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. జాతి గర్వించేలా జగమంత కనిపించేలా దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ కి ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు, భారతసమాజానికి అత్యుత్తమమైన, పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు, అణ‌గారిన‌వ‌ర్గాల హ‌క్కుల‌కి పెద్ద దిక్కుగా నిలిచిన గొప్ప వ్యక్తి, ఆయన భావాలకు మరణం లేదు అని, 100 ఏళ్ళకు పైగా భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న ఆ మహానుభావుడికి, ఆ మహాశక్తికి, వారి ఆశయ సాధనకు కృషి చేయాలనీ పిలుపునిచారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here