- కాపు కార్తీక మాస వన భోజన మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో మియాపూర్ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కాపు కార్తీక మాస వన భోజన మహోత్సవం వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన కార్తీక మాసం సందర్బంగా మియాపూర్ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజన మహోత్సవ నిర్వహించుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. మున్నూరుకాపు, కాపు ఐక్యతగా ఉండాలని, ఆర్య వైశ్య సభ్యులు ఆర్థికంగా రాజకీయంగా రాణించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం సభ్యులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.