- గురువులకు ఉగాది పురస్కారాలు, కళాకారులకు జ్ఞాపికలు అందజేత
నమస్తే శేరిలింగంపల్లి : అయోధ్య రామునికి నృత్యనీరాజనం, రామోత్సవం అత్యంత వైభవోపేతంగా జనరంజకంగా జరిగింది. పూజ్య స్వామీజీ మైసూరు దత్త పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ దివ్య ఆశీస్సులతో ప్రముఖ సాంస్కృతిక సంస్థ స్వరమహతి కళాపరిషత్, స్థానిక కార్యసిద్ధి పంచముఖ హనుమాన్ ఆలయం ట్రస్ట్, ఎస్జిఎస్ ఆశ్రమం ఎల్ఐజి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐదు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ నృత్య సంగీత కళాకారులు, గురువులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ జి చంద్రమౌళీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వరమహతి కళాపరిషత్ సంస్థను అభినందించి, అధ్యక్షులు బంధనపూడి ఆదిత్య కిరణ్ ని సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న గురువులకి ఉగాది పురస్కారాలు, కళాకారులందరికీ జ్ఞాపికలను ట్రస్టు సభ్యులు, స్వరమహతి కళాపరిషత్ అధ్యక్షులు డాక్టర్ బంధనపూడి ఆదిత్య కిరణ్ అందజేశారు.
ఆదిత్య కిరణ్ మాట్లాడుతూ స్వరమహతి కళాపరిషత్ ఎల్లప్పుడూ కళలు, కళాకారులు, భారత సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణలో ముందుంటుందని, ఈ అవకాశాన్ని కల్పించిన పంచముఖ హనుమాన్ ట్రస్ట్ కి, పాల్గొన్న కళాకారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మేనేజింగ్ ట్ర స్టీ ఎన్ శ్రీనివాసరాజు, వేదవతి, అమిత, తదితర ట్రస్ట్ సభ్యులు, మీడియా కోఆర్డినేటర్ బంగారు వెంకట్ రావు, డాక్టర్ శ్రీనివాస వరప్రసాద్, డా సంధ్య దేవి, జయప్రకాష్, మహేష్ కుమార్, మందశ్రీ దేవులపల్లి కుమార్, తులసి, విజయలక్ష్మి, ఉమా, నాగేశ్వరరావు పాల్గొన్నారు.