బాల, బాలికల అనాథ శరణాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి

  • జీహెచ్ఎంసీ కార్మికుల సేవా కార్యక్రమాలు
  • పండ్లు, మజ్జిగ పంపిణీ చేసిన అవనీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూర్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఓ బాల, బాలికల అనాథ శరణాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ కార్మికులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

స్థానికంగా ఓ బాల, బాలికల అనాథ శరణాలయంలో చిన్నారులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి నివాళి అర్పించిన అవనీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూర్

జీహెచ్ఎంసీ కార్మికులు కృష్ణ , వరుణ్, మల్లికార్జున్, అజయ్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి అవనీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బాల, బాలికలకు పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఇలాంటి సేవ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు.

పండ్లు పంపిణీ చేసిన దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here