అంబేద్కర్ మార్గం అందరికీ ఆచరణీయం : శేరిలింగంపల్లి బిజెపి ఇన్చార్జి రవికుమార్ యాదవ్

  • చందానగర్, ఎంఏ నగర్, మసీదుబండ సర్కిళ్ళలో అంబేద్కర్ విగ్రహానికి నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: అంబేద్కర్ మార్గం అందరికీ ఆచరణీయమని శేరిలింగంపల్లి బిజెపి ఇన్చార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ 134 జయంతినీ పురస్కరించుకుని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు గంగారం చందానగర్, ఎంఏ నగర్, మసీదుబండ సర్కిళ్ళలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న రవి కుమార్ యాదవ్

అనంతరం రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలు, ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేశారు. ఇవాల్టికి దేశంలో ప్రజలంతా హక్కులతో జీవిస్తున్నారంటే దానికి కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగమేనని కొనియాడారు. అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో గొప్ప గొప్ప చదువులు చదివిన అంబేద్కర్ తన విజ్ఞానం, మేథస్సును కలిపి భారత రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. కేసీఆర్ లాంటి కొంతమంది స్వార్థ పూరిత నాయకులు భారత రాజ్యాంగాన్ని మారుస్తామంటూ తమ సంకుచిత బుద్ధిని బయట పెట్టుకున్నారని గుర్తు చేశారు. అలాంటివారికి ప్రజలు ఎలా బుద్ధి చెబుతారో గత ఎన్నికల్లో చూసామన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అంబేద్కర్ కు సరైన గౌరవం ఇవ్వకుండా ఆయన విలువలను, ఆశయాలను విస్మరించిందని తెలిపారు.

బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో మాట్లాడుతున్న రవి కుమార్ యాదవ్

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, అర్జున్, విజయ్, గౌతమ్, రవికాంత్, మన్యం, ప్రేమ్, బాలరాజు, దశరథ్, జ్ఞానేశ్వర్ అనేక మంది దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here