- కంటివెలుగు వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ విప్ గాంధీ
- అవసరమైన వారికి ఉచితంగా చికిత్స, ఆపరేషన్లు
- సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు గాంధీ పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి : రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంపై జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్ లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి గౌరవ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, దయనంద్ గుప్తా, కలెక్టర్ అమోయ్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం మొదటి దశ విజయవంతమైందని, వృద్దుల కోసం, కంటి సమస్యలు ఉన్న వారి కోసం వారి జీవితాలలో వెలుగులు నింపాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18వ తేదిన నుండి రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబందించిన కార్యక్రమాల ఏర్పాట్ల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపామని, ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, కంటి వెలుగు సెంటర్ లో ఉచిత కంటి పరిక్షలు ,చేసి అవసరమైన వారికి కళ్ళద్దాలు, పంపిణీ చేస్తారని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు నిర్వహిస్తారని చెప్పారు.
