- త్రివేణి పాఠశాలలో ఘనంగా వార్షిక క్రీడా సంబురాలు
- ఆకట్టుకున్న విద్యార్థులు గౌరవ వందనం
నమస్తే శేరిలింగంపల్లి: చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, క్రీడలతో రోగనిరోదక శక్తి పెంపొందుతుందని ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్, రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రెటరీ భాస్కర్ రెడ్డి, త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి అన్నారు. స్థానిక మదీనాగూడలోని త్రివేణి పాఠశాలలో వార్షిక క్రీడా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. క్రీడలతో మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవుతారని తెలిపారు.

త్రివేణి పాఠశాలలో క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తామని విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మార్చి పాస్ట్ తో పాటు, శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సీఏసి డా॥ నటరావు, CRO సాయి నరసింహారావు, HEAL- సెంట్రల్ 111 కో ఆర్డినేటర్ చాస్త్రి, సిఎస్ఓ సుబ్బారావు, పాఠశాల ప్రధానాచార్యులు, జగదీశ్వర రావు, వైస్ ప్రిన్సిపల్ హిమబిందు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు జెండా ఆవిష్కరించి, క్రీడాజ్యోతిని వెలిగించి, గౌరవ వందనం చేసిన విధానం అందరిని ఆకట్టుకున్నది.
