- మెదక్ లో కత్తిపోట్లకు గురై మియాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోసంరక్షణకుడిని పరామర్శించిన మెదక్ ఎంపి
నమస్తే శేరిలింగంపల్లి: గోవులను తరలిస్తున్నారని తమ గో సంరక్షకులు, పోలీసులకు సమాచారం ఇస్తే మెదక్ టౌన్ పోలీసులు మాత్రం చాల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ధ్వజమెత్తారు. బక్రీద్ పండుగ సందర్భంగా జంతువు వధపై చాలా స్పష్టంగా రాష్ట్రాల డీజీపిలకు ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. కానీ ఇక్కడ చట్టం తెలియకుండా పోలీసులు మాట్లాడుతున్నారన్నారు. హిందువులని అరెస్టు చేశారు, గో సంరక్షకులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోతే జరిగే పరిణామాలకు ఎస్పీ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
నిన్నటి ఘటనపై పోలీసులే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మెదక్ టౌన్ లో 144 సెక్షన్ ఉందని డిజి చెబుతున్నారని, తనను ప్రజలు ఎన్నుకున్నారని, కచ్చితంగా మెదక్ వెళ్తానని ఎవరు అడ్డుకుంటారో చూస్తానన్నారు. మీరు భయపడితే భారత రాజ్యాంగానికి, ప్రజలకు భయపడాలని తెలిపారు. ఉదయం ఐదుగురు, సాయంత్రం మరి కొంత హిందువులనే అరెస్ట్ చేశారని, ఘటనకు బాధ్యులైన ముస్లింలను అరెస్ట్ చేయలేదన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.