సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి అందజేత

  • ఇద్దరికి రూ. 2లక్షలు మంజూరైనట్లు తెలిపిన ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం.. ఆసుపత్రి బిల్లుల పరిహర్థం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ద్వారా రూ. 2 లక్షలు మంజూరయ్యాయి. ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి మంజూరి పత్రాలను బాధిత కుటుంబాలకి అందజేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . చందానగర్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీకి చెందిన రాముడుకి రూ. 1లక్ష, వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీకి చెందిన కృష్ణ రెడ్డికి రూ. 1లక్ష మంజూరయ్యాయని, ఈ సందర్బంగా వారికి సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి పత్రాలను అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, తెరాస నాయకులు చంద్రారెడ్డి , ఆంజనేయులు, శ్రావణి రెడ్డి పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి పత్రాలను అందజేస్తున్న ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here