- పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శిల్పఎంక్లేవ్ లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో కొనసాగుతున్న కార్తీక మాస లక్ష దీప మహోత్సవవం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా సోమవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకోని ఆలయ ప్రధానార్చకులు పవనకుమార శర్మ, మురళీధర శర్మ బృందం పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం భక్తి ప్రపత్తులతో జ్వాల తోరణం కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం దాతలు డి.కిషోర్-స్వాతి, కుందా రాజు-శ్రీ చందన, శ్రీనివాస్ వరప్రసాద్, రవీంద్రనాథ్-అనిత, శ్రీనివాస్ వరప్రసాద్ దంపతులను ఆలయ కమిటి చైర్మన్ యూవీ రమణ మూర్తి, సభ్యులు ప్రత్యేకంగా సన్మానించారు. ఉత్సవం విజయవంతం అవ్వడానికి కృషి చేసిన వారందరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.
ముగింపు ఉత్సవాల్లో విశాఖ శ్రీ శారదా పీఠం ఆగమ సలహాదారు శ్రీ సుదర్శనం సత్యసాయి ఆచార్యులు ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు చంద్రశేఖర్, చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, సుధాకర్, విద్యాసాగర్ తదితరులు, శిల్పాఎన్‌క్లేవ్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు, ఆలయ సేవాదళం సభ్యులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పదివేల దీపాలు వెలిగించారు. కార్తీక పౌర్ణమి వేళ దీపకాంతుల వెలుగులతో శిల్పా ఎంక్లేవ్ లో ఆధ్యాత్మికత వెళ్లి విరిసింది.