నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని శేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంటు ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. నియోజకవర్గంలో 633 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ నిమిత్తం వినియోగించిన ఈవీఎంలు కంట్రోల్ యూనిట్ వివి పాట్లను సోమవారం రాత్రి పూర్తిస్థాయిలో పివో ల నుంచి నియోజకవర్గ ఎన్నికల అధికారులు స్వీకరించారు.
మంగళవారం ఉదయం ప్రత్యేక వాహనాలను పటిష్ట బందోబస్తు నడుమ చేవెళ్లలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. అనంతరం అక్కడ కేంద్రంలో నియోజకవర్గానికి కేటాయించిన స్ట్రాంగ్ రూమ్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఏఆర్ఓ స్నేహ శబరిష్ ఆధ్వర్యంలో ఈవీఎం యంత్రాలను భద్రపరిచారు.