మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం

  • శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.

జూబ్లీ గార్డెన్ వద్ద జి.హెచ్.ఎం.సి ఏ.ఈ ప్రశాంత్, ట్రాఫిక్ సిబ్బంది/కాలనీ సభ్యులతో కలిసి ఆయా ప్రాంతాలను పరిశీలిస్తున్న శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి  జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్ డివిజన్ పరిధిలోని జూబ్లీ గార్డెన్ నందు జి.హెచ్.ఎం.సి ఏ.ఈ ప్రశాంత్, ట్రాఫిక్ సిబ్బంది/కాలనీ సభ్యులతో కలిసి పర్యటించారు. చేపట్టాల్సిన నాల అభివృద్ధి పనులు పరిశీలించారు. కాలనీలో నూతనంగా నిర్మించాల్సిన సీసీ రోడ్డు పనులను స్థానికులు జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమంలో రమణ రెడ్డి, సుధీర్, రాంబాబు, రవి కుమార్, శ్రీనివాస్, వెంకటేష్, శ్రీధర్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here