నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా… ఇద్దరు లబ్ధిదారులకు రూ. ఒక 1 లక్ష 20 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబాలకి అందజేశారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ కి చెందిన సంజీవ్ కుమార్ కి రూ. 60 వేలు
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ కి చెందిన నాగశేషుకి రూ. 60 వేలు మంజూరైనట్లు ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.
ఈ సందర్భంగా వైద్య చికిత్సకి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు