నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా

  • ఉదయం 11 గంటలకు మేళ
  • సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పిలుపు

నమస్తే శేరిలింగంపల్లి: నేడు ఉదయం 11 గంటలకు జిహెచ్ఎంసీ సహకారంతో లైట్‌హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్ జాబ్ మేళాను నిర్వహిస్తోంది. చందానగర్ జిహెచ్ఎంసీ కార్యాలయం పక్కన జిహెచ్ఎంసీ కల్యాణ మండపం వద్ద నిర్వహించే ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీలు (రిటైల్, బ్యాంకింగ్, లాజిస్టిక్స్, ఫార్మసీ, సేల్స్, ఐటి) పాల్గొని వివిధ రంగాలలో వివిధ స్థానాలకు తగిన అభ్యర్థులను రిక్రూట్ చేయనున్నాయి. SSC, ఇంటర్మీడియట్, డిగ్రీ, B.Tech, PG ఇతర అవసరమైన అర్హతలు కలిగిన విద్యావంతులైన నిరుద్యోగ యువత జాబ్ మేళాకు సద్వినియోగం చేసుకోవాలని చందానగర్ డివిజన్ (110) కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. అభ్యర్థులు తమ ఆధార్ కార్డ్, Bio-Data వెంట తీసుకెళ్లాలని , సమాచారం కోసం ‘సెల్ నెంబర్ 9059305512 ను సంప్రదించగలరని సూచించారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here