- రాయదుర్గం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన గంగాధర్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కంటి వెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరాన్ని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజలు కంటి సమస్యలు ఉన్నవారు ఉచిత కంటి పరీక్ష శిబిరాలకు వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోవాలని, పరీక్షలు పూర్తయిన తర్వాత ఉచితంగా కంటి అద్దాలు మందులు పొందాలని, అవసరమైన వారికి కంటి పరీక్షల నిర్వహణ అనంతరం రీడింగ్ అద్దాలు అక్కడికక్కడే పంపిణీ చేస్తారని తెలిపారు. పేద, ధనిక, కులమతాల తేడా లేకుండా అవసరం ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా అద్దాలు, అవసరమైతే ఆపరేషన్లు , శస్త్రచికిత్సలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేస్తారని పేర్కొన్నారు. కంటి సమస్యలతో పాటు కళ్లు మసకగా కనిపించినా వాటికి సంబంధించిన మందులను సైతం అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ జనరల్ సెక్రటరీ సురేంద్ర ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్, ఆర్. వెంకటేష్, దయాకర్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షురాలు ఇందిరా సీనియర్ నాయకులు కృష్ణ యాదవ్,నరేందర్ యాదవ్, శ్యామ్ యాదవ్, విష్ణు, వెంకట్, దుర్గరామ్, చిన్న, గోపాల్, వైద్య అధికారులు, సిబ్బంది,ప్రజలు, స్థానిక నేతలు, బస్తీ వాసులు మహిళా నాయకులు, కార్యకర్తలు, పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.