నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలను అంతటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దారిపొడవునా నెత్తిన బోనాలతో మహిళలు భక్తి ప్రపత్తులు చాటుతున్నారు. శివ సొత్తుల పూనకాలు.. డప్పుల దరువులు నడుమ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి.

ఇందులో భాగంగా మంగళ వారం శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎల్లమ్మ బండ కాలనీ ఆలయంలో ఘనంగా ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అమ్మవారిని టీపీసీసీ జనరల్ సెక్రటరీ జేరిపాటి జైపాల్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దీవెనలతో ప్రజలు చల్లగా ఉండాలని వేడుకున్నారు. ఈ సందర్బంగా ఆయనను గజమాలతో సత్కరించారు.






