నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ లోని మార్తాండ నగర్, ప్రేమ్ నగర్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జేరిపాటి జైపాల్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ మహిపాల్ యాదవ్ తో కలిసి శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎం .ఎల్ .ఏ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ పాదయాత్రలో పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటుని అభ్యర్ధించారు.
అనంతరం జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. ఏ ప్రాంతానికి వెళ్లిన మహిళలు హరతులతో స్వాగతం పలుకుతున్నారని, కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి మహిళలకి ఆమోదయోగ్యంగా ఉందని, స్వచ్చందంగా మహిళలు ముందుకు వచ్చి వారి మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.