తెలంగాణ సిద్ధాంతకర్తకు జనసేన ఆధ్వర్యంలో ఘన నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్నే అంకితం చేసి స్వరాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసిన మహనీయుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆ మహనీయుడికి జనసేన పార్టీ శేరిలింగంపల్లి ఇన్ ఛార్జి డా.మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఆయన చిత్ర పటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరిమహిళా దాక్షాయణి, నాయకులు మల్లేష్ ముదిరాజ్, హనుమంత్ నాయక్, సేవ్య నాయక్, మొత్య నాయక్, గాంధీ, రఘ, వినీష్, మణ్యమ్, రవి నాయక్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here