నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా యుధ్ధ నౌకగా పేరుగాంచిన కవి, రచయిత గద్దర్ మృతి చాలా బాధాకరం అని ప్రభుత్వ విప్ గాంధీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ ఇక లేరనే వార్త నన్ను ఎంతగానో కలిచివేసిందని అన్నారు. తనకు అత్యంత ఆత్మీయుడు, మంచి స్నేహితుడు, ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా, తనదైన పాటలతో అందరినీ కదిలించిన ప్రజాగాయకుడు లేని లోటు పూడ్చలేనిదన్నారు. ‘అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల కాలమా’ అంటూ, ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా’ అంటూ తెలంగాణ ఉద్యమంలో తన గళంతో కోట్ల మందిని ఉత్తేజపరిచిన ప్రజా గొంతుక గద్దర్ అని కొనియాడారు. గద్దర్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిగీచారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.