నమస్తే శేరిలింగంపల్లి: జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి రవికుమార్ యాదవ్ శేరిలింగంపల్లి జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లగా ఘన స్వాగతం లభించింది. ఆ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ మాధవ రెడ్డి, వీర మహిళలు డివిజన్ అధ్యక్షులు జనసేన నాయకులు జనసైనికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బిజెపి జనసేన ఉమ్మడి కార్యాచరణ గురించి చర్చించారు.

15 రోజులు సమయం ఉన్నందున గడపగడపకు వెళ్లి ఉమ్మడి అభ్యర్థి రవికుమార్ యాదవ్ గెలుపు కోసం కృషి చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు వీర మహిళలు, జనసేన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొని రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ని భూస్థాపితం చేస్తామని తీర్మానం చేశారు.
