నమస్తే శేరిలింగంపల్లి: టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం రావు ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వి జగదీశ్వర్ గౌడ్ మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను కలిసి మద్దతు కోరారు.
ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎ – బ్లోక్ అధ్యక్షులు యండి ఇలియాస్ షరీఫ్ అనుచరులు, నల్లగండ్ల రమేష్ కుమార్, మియాపూర్ డివిజన్ నాయకులు అందరూ జగదీష్ అన్నకి మద్దతు తెలుపుతూ భారీ మెజారిటీ తో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు.