- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
- ముక్తకంఠంతో నినదించిన జనప్రియ నగర్ వాసులు
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలో అఖండ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తామని, సీఎం కు కానుకగా ఇస్తామని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. జనప్రియ నగర్ ఫేస్ 5 కాలనీలో కాలనీ వాసులతో ఆత్మీయ సమావేశం ఆత్మీయంగా జరిగింది. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జనప్రియ నగర్ కాలనీ వాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాబోయే ఎన్నికల్లో తమ పూర్తి స్థాయి మద్దతు ప్రభుత్వ విప్ గాంధీకే ఉంటుందనీ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తనపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.
ముచ్చటగా మూడో సారి భారీ మెజారిటీ తో గెలిచి శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలబెట్టడానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ప్రత్యామ్నాయ రోడ్లు, ఫ్లై ఓవర్లు , అండర్ బ్రిడ్జిలు కొత్త ప్రతిపాదనలతో పకడ్బందీ ప్రణాళికతో అధికారుల సమన్వయంతో అభివృద్ధి అద్భుతంగా జరిగాయన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి, తమకు చాలా గౌరవంగా ఉందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, దాత్రి గౌడ్, వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్, ఉరిటీ వెంకట్ రావు, సుధాకర్, రవీందర్ రెడ్డి మరియు జనప్రియ నగర్ వాసులు రవి కుమార్, సురేష్, విశ్వనాథ్, సత్యలక్ష్మి, రమ, రామాంజనేయులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు, అభిమానులు పాల్గొన్నారు.