నమస్తే శేరిలింగంపల్లి : జై గణేష భక్తి సమితి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ సోషల్ మీడియా కార్యనిర్వహణ సభ్యుడు శ్రవణ్ కుమార్ జీఎస్ఆర్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా… ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంఛార్జి డాక్టర్ మాధవరెడ్డి, జై గణేష భక్తి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జైన్ కుమార్, రాష్ట్ర సభ్యులు లక్ష్మణ్ హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడదామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ సభ్యులు కే.మహేందర్, సంగారెడ్డి సభ్యులు వి.రమేష్, నియోజకవర్గ సభ్యులు, జనసేన పార్టీ చందానగర్ డివిజన్ అధ్యక్షులు బి.అరుణ్ కుమార్, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు మాధవరావు, హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షురాలు మద్దూరి నాగలక్ష్మి, ఐటి టీమ్ సభ్యులు సునీల్, బాలాజీ, వీర మహిళలు ఇందుమతి , పుష్పలత పాల్గొన్నారు.