- స్వామి వివేకానంద ఆశయాలను పాటిద్దామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి : స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ హఫీజ్ పేట్ డివిజన్ మైత్రి నగర్ కమాన్ వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ శ్రేణులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ రోజుల్లోనే యువకులు సామాజికంగా రాజకీయంగా దేశం ఎదుగుదలలో ఎలా ఉపయోగపడతారో చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని కొనియాడారు. గమ్యం చేరేవరకు ఆగవద్దు.. ప్రయత్నిస్తూనే ఉండాలి, నమ్మకాన్ని, వీడొద్దు. భయాన్ని వదిలేయండి. భయమే పెద్ద పాపం..మందలో ఉండకు..వందలో ఒక్కడిగా ఉండటానికి ప్రయత్నించు.. ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు..ఇలా రోజూ వినే ఎన్నో గొప్ప వాఖ్యాలు స్వామి వివేకానంద చెప్పినవేనన్నారు.
ఈ కార్యక్రమంలో వినోద్ రావు, నాగుల్ గౌడ్, మనోహర్, శ్రీధర్ గౌడ్, మాణిక్ రావు, గణేష్ ముదిరాజ్, ఆకుల లక్ష్మణ్, పృథ్వి గౌడ్, యాదగిరి, రవి, శ్రీనివాస్ యాదవ్, విజయేందర్, శ్రీను జే, రాము జే, బాబు, రమేష్, శివరాజ్, బాషా శివ , రవీందర్ నాయక్ , రాజ్ కుమార్, శివ, సురేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.