విద్యార్థి దశ మధురానుస్మృతులు ఎన్నటికీ మరువలేం

  • అంతా  ఒకచోట చేరి ఒకరికొకరు ఆత్మీయ పలకరింపులు
  • ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న విద్యార్థులు 
  • తమకు విద్యను బోధించిన గురువులకు ఘనంగా సన్మానం
  • వేడుకగా 1992-93 పూర్వ విద్యార్థుల సమ్మేళనం


నమస్తే శేరిలింగంపల్లి: విద్యార్థి దశ మధురానుస్మృతులు ఎన్నటికీ మరువలేమని, మళ్ళీ అందరు ఒకచోట చేరి ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు పూర్వ విద్యార్థులు. బీహెచ్ఈఎల్ లోని అంబేద్కర్ భవన్ లో ఆదివారం 1992-93 బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వివిధ రంగాలలో స్థిరపడిన వారు తమ గత స్మృతులను నెమరువేసుకున్నారు. అంతా ఒకేచోట చేరి ఆత్మీయ పలకరింపులతో వారి వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ.. ఆనాటి అనుబంధాలను, తాము పదో తరగతి చదివే రోజుల్లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ.. ఒకరికొకరు చెప్పుకుంటూ, సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. తమ విద్యను బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here