నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జగదీశ్వర్ గౌడ్ ని ప్రజయ్ సిటీ వాసులు మర్యాద పూర్వకంగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. పార్క్ సమస్య వేధిస్తున్నదని ఆయన దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై జగదీశ్వర్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. వెంటనే రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు ఏ వచ్చిన పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోడలి శ్రీధర్, రవి కుమార్, శ్రీనివాస్, సుబ్బారావు, రత్నం, ప్రసాద్, రమేష్ రెడ్డి, సూర్య నారాయణ, హేమంత్ కుమార్, ఆర్ఎంపీ రెడ్డి, రాంబాబు, శ్రీనివాస్ రెడ్డి, రాఘవ రావు, రామచంద్రుడు, ప్రసాద్, సత్యనారాయణ, ప్రభాకర్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.