- అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి :
శ్రీ చేగురి బాలకృష్ణ గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్ మధురవేణి, చైర్మన్ సాయికుమార్
నమస్తే శేరిలింగంపల్లి : అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని శ్రీ చేగురి బాలకృష్ణ గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్ చేగురి మధురవేణి, చైర్మన్ సాయికుమార్ అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
అయ్యప్ప స్వాముల కోసం మియాపూర్ పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్స్ సాయిబాబా టెంపుల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్వాములు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతకుముందు అయ్యప్ప స్వామికి భక్తిశ్రద్దలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
ఈ కార్యక్రమంలో అన్నదాన నిర్వాహకులు గురుస్వామి బాబ్జి, విఆర్ ప్రవీణ్ స్వామి, ప్రశాంత్, బి. మల్లేష్ యాదవ్, మనోహర్, హేమంత్ రెడ్డి, ఈశ్వర్ గురుస్వామి, నితిన్, హేమంత్ రెడ్డి, లక్ష్మీకాంత్, సిహెచ్ హేమంత్ రావు గౌడ్, సిహెచ్ కిషోర్ గౌడ్, అరుణ్ గౌడ్, కుమార్ గౌడ్, మియాపూర్, హఫీజ్పేట్ లోని స్వాములు అందరూ వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.