నమస్తే శేరిలింగంపల్లి: పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. శోభా రాజు, వారి శిష్యులు కలసి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా 98వ జయంతిని అన్నమాచార్య భావనా వాహిని, అన్నమయ్య సధనంలో నిర్వహించారు.
“ఓం మహా గణపతయే నమః”, “ఓం నమః శివాయ”, “ఓం నమో నారాయణాయ ఓం నమె సాయి నాథాయ”, “శ్రీ గురుభ్యోనమః సాయి మహభ్యో నమః”, “ఇష్ట దేవతా నమో”, “ఎక్ బార్ క్షమాకరో సాయి” వంటి సత్య సాయి బాబా పై స్వీయ రచన చేసి, సంగీతం సమకూర్చి, శిష్యులతో కలిసి డా. శోభా రాజు పాడారు.
వాయిద్య సహకారం కీబోర్డ్ పై రాజు, తబలా పై జయ కుమార్ ఆచార్య సహకరించారు. గాత్రంపై అన్నమాచార్య భావనా వాహిని శిష్యులు గాయత్రి, రన్విత, డా. శశికళ, బి. వి. శర్మ, వాసంతి, అభిరామ్, కళ్యాణ్ సాగర్ సహకరించారు. చివరిగా అన్నమయ్య సమేత శ్రీ వేంకటేశ్వర స్వామికి, శ్రీ సత్య సాయి బాబా చిత్ర పటాలకు మంగళ హారతి ఇచ్చి విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు.