- గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్రలో : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : గడపగడపకు బీజేపీ రవన్న ప్రజా యాత్ర కార్యక్రమంలో భాగంగా లింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ గడప గడపకు తిరుగుతూ కరపత్రాలను పంచుతూ, బి ఆర్.ఎస్ పార్టీ అవినీతి అక్రమాలను తెలుపుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాపిరెడ్డి కాలనీలో రోడ్లు, డ్రైనేజీ , పార్క్ మంజీర వాటర్ లైన్లు, ఇళ్ళ పట్టాలు, స్ట్రీట్ లైట్స్ ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేసింది భిక్షపతి యాదవ్ మాత్రమేనని, బి.ఆర్.ఎస్ ప్రభుత్వం వచ్చాక కాలనీకి ఏమి చేయలేదన్నారు. కాలనీవాసుల ప్రధాన సమస్య వర్షం వచ్చిన ప్రతి సారి రోడ్లు మునిగిపోయే పరిస్తితి, నార్నే ఎస్టేట్స్ నుండి వచ్చే లింక్ రోడ్ పని కూడా పెండింగ్ లో ఉందని, పదేళ్లు అధికారంలో ఉన్న బి.ఆర్.ఎస్ నాయకులు పట్టించుకోలేదని, వీళ్ళ అవినీతిని ఒక్కొక్కటిగా రోజు బయటపెడతామన్నారు.
అవినీతిమయమైన పార్టీకి కాకుండా , అభివృద్ధికి చిరునామా బీజేపీ, మీరందరూ భారతీయ జనతా పార్టీ కి ఓటు వేసి గెలిపించండి, గెలిచిన వెంటనే ప్రణాలికా బద్దంగా పని చేసి చూపిస్తానని హామీ ఇవ్వగా కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులు భారతీయ జనతా పార్టీ పై ఉండాలని కోరారు. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈ ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ యాదవ్, రమేష్, నరసింహ, శ్రీశైలం, విజయలక్ష్మి, శ్రీను, విజయ్, నరసింగ్ యాదవ్, ఇమ్రాన్, బీరప్ప, అఖిల్, ఆదిలక్ష్మి, సుశీల, రాజేష్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.