నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ వాకింగ్ రోడ్డు, వినాయక పార్క్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరందుకున్నది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కి మద్దతుగా హస్తం గుర్తుకు ఓటు వేసి వి. జగదీశ్వర్ గౌడ్ ని గెలిపించాలంటూ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విద్యాకల్పన ఏకాంత్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు భాషిపాక యాదగిరిలు ప్రచారం నిర్వహించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముకయ్య, ఆల్వాల భాస్కర్, అశోక్, రమేష్, గణేష్ గౌడ్, చిరుమూర్తి రాజు, అల్వల రమేష్, జీతేందర్, దుర్గ, బొట్టు శ్రీను, రాజు, రాము, ఆంజనేయులు, వినోద్, నాగుల్ల మల్లేష్, శృతి గౌడ్, షాలిని పాల్గొన్నారు.