ఘనంగా వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు

  • స్వరూపానందేంద్ర ఆశీస్సులు అందుకున్న తెలంగాణ సీఎస్

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి.

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల యాగం అనంతరం ఆలయానికి వచ్చి వేడుకలను అంగరంగ వైభవంగా జరిపించారు.

ఈ సందర్భంగా శనివారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఏ శాంతికుమారి ఆలయానికి వచ్చి పీఠాధిపతుల ఆశీస్సులు పొందారు.

ఇందులో భాగంగా రాజశ్యామలా అమ్మవారి శేష వస్త్రాలను స్వరూపానందేంద్ర శాంతికుమారి ఇచ్చారు. సీఎస్ శాంతికుమారితో పాటు రాజ్యసభ మాజీ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు దంపతులు స్వరూపానందేంద్ర ఆశీస్సులు అందుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here