నమస్తే శేరిలింగంపల్లి: అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షుడు పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారధ్యంలో ప్రతి శనివారం జరిగే అన్నమ స్వరార్చన, నృత్యార్చన అలరించింది. ఈ కార్యక్రమంలో తొలుత శోభా రాజు విద్యార్థులు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్, శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రమ్, శ్రీ అన్నమాచార్య అష్టోత్తర శత నామావళి, గురుస్తుతితో ప్రారంభించారు.
అనంతరం తెలుగువన్.కామ్ రేడియో జాకీ హిమబిందు నేతృత్వంలో బిజీ బీస్ లర్నింగ్ సెంటర్ ద్వారా సంగీతం, నృత్యం, చిత్ర లేఖనం, స్తోత్ర పఠనం గురువుతో పాటు శిష్యులందరు సునిల్, విఖ్యాత్, ఇందిరా, మిహిర, తన్విక, సమయ, మీర, చక్రిక, అశ్విని, శ్రీరామ చంద్ర, హేమాన్విక, శ్రీవల్లి, సన్విష, గోపిక శ్రీనిధి, శిరీష -అభిరామ్, ఆర్తి – నేహా, ఝాన్సి – మను సాయి, రవిన-కళ్యాణి గారు, బి.శిరీష -మిహిర కలిసి చేశారు. అనంతరం అన్నమాచార్య భావనా వాహిని మేనేజింగ్ డైరక్టర్ నందకుమార్ ప్రదర్శితులకు సంస్థ ఙ్ఞాపికనిచ్చి బహుకరించారు. అనంతరం అన్నమయ్య సమేత వేంకటేశ్వర స్వామికి మంగళ హారతి ఇచ్చారు.