- ఘనంగా మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ జన్మదిన వేడుక
- ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. ఇంటర్ విద్యార్థినులకు ఆర్థిక సాయం
నమస్తే శేరిలింగంపల్లి: బి.ఆర్.ఎస్ కార్యకర్తలు, శ్రీ కృష్ణ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ప్రజల మనిషి, పేదల పెన్నిధి ప్రజలే నాయకులు, నాయకుడే సేవకుడు అని భావించిన ప్రజా సేవకుడు, ఎంతో మంది యువతకు ధైర్యం, నడిపించే శక్తి, ప్రజల మనిషిగా ప్రజా సేవకై నిరంతరం శ్రామిస్తున్న నాయకుడు శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకులు, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్.. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని నల్లగండ్ల గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కలు నాటారు.
అనంతరం హాఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ పరిధిలోని శాంతి నగర్, గంగారాం, గోకుల్ ప్లాట్స్, ఖానామేట్, ఇజ్జత్ నగర్, చంద్ర నాయక్ తండా వద్ద ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అంతేకాక శాంతి నగర్ నివాసి రాజు కుమార్తెలకు ఇంటర్ మొదటి సంవత్సరం చదువు నిమిత్తం ఆర్ధిక సహాయాన్ని అందించారు శ్రీ కృష్ణ యూత్ సభ్యులు.
ఈ కార్యక్రమంలో వివేక్ గౌడ్, చైర్మన్ శ్రీనివాస రెడ్డి, బాలరాజ ముదిరాజ్, అధ్యక్షులు భీమని ఆదిత్య ముదిరాజ్, సభ్యులు బాలకృష్ణ, ప్రవీణ్, మనోజ్, కృష్ణ గౌడ్, సయ్యద్ గౌస్, పి.విజయందర్ రెడ్డి, యాదగిరి, లక్ష్మణ్, శివ కుమార్ గౌడ్, శైలేష్, క్రాంతి, భాస్కర్, జగదీష్, మల్లేష్, శివనంద్ రెడ్డి, అభిలాష, వంశీ కృష్ణ, శ్రీకాంత్ యాదవ్, మూర్తి, సతీష్ పాల్గొన్నారు.