నమస్తే శేరిలింగంపల్లి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీని 2021-2023 సంవత్సరానికి గాను శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుందని శేరిలింగంపల్లి ఎక్సైజ్ సీఐ గాంధీ నాయక్ పేర్కొన్నారు. తమ పరిధిలోని ఏడు వార్డులకు మొత్తం 39 వైన్స్ షాపులు కేటాయించబడ్డాయని తెలిపారు. వీటిలో ఎస్సీ వర్గానికి మూడు, గౌడ వర్గానికి ఐదు వైన్స్ షాపులు కేటాయించడం జరిగిందన్నారు. నూతన మద్యం పాలసీ విధానాల ప్రకారం ఈ నెల 9 వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. దరఖాస్తు చేసుకునే వారు రూ. 2 లక్షల దరఖాస్తు ఫీజుతో డీడీ రూపంలో District Prohibition & Excise officer – Shamshabad పేరిట లేదా చలాన్ రూపంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. రూ. 2 లక్షల ఫీజు తిరిగి చెల్లించబడదన్నారు. వైన్స్ షాప్ టెండర్ ప్రక్రియ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ఎల్ బి నగర్ లో ఈ నెల 20 వ తేదీన డ్రా పద్దతిలో ఉంటుందని సీఐ గాంధీ నాయక్ వెల్లడించారు. మద్యం పాలసీ లైసెన్స్ దారులకు 7 సార్ల నుంచి 10 సార్ల వరకు చేయడం జరిగిందని తెలిపారు.