- పోస్టర్ ఆవిష్కరణలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య చలో ఢిల్లీ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ.. తక్షణమే బిజెపి గవర్నమెంట్ కులగణన చేపట్టి, బీసీలకు రాజ్యాధికారంలో జరుగుతున్న అన్యాయాలను, అడ్డుకట్టలు తొలగించి బీసీలకు న్యాయం చేకూర్చాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిసి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టాలని, బీసీలకు దామాషా పద్ధతిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు 52% కల్పించాలని అన్నారు. ప్రైవేట్ సెక్టార్లలో కూడా బీసీ రిజర్వేషన్లను అమలుపరచాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఓబీసీ ఫెలోషిప్లను పెంచాలని అన్నారు. అన్ని బీసీ కుల సంఘాల నాయకులు, బీసీ ప్రతినిధులు ఆగస్టు 7వ తేదీన హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.