నమస్తే శేరిలింగంపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన ఎమ్మెల్యేల మొదటి జాబితాలో శేరిలింగంపల్లి నియోజకవర్గం స్థానం సిట్టింగ్ ఎమ్మెల్యే గాంధీకి ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం దగ్గర చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి టపాసులు పేల్చి స్వీట్లు పంచారు. అనంతరం ఎమ్మెల్యే గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం ప్రజలలో ఉంటూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఎమ్మెల్యే గాంధీకి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం సంతోషనీయమని, రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటితో ఎమ్మెల్యే గాంధీని మళ్ళీ గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బిఆర్ ఎస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, గురుచరణ్ డబ్బే, అక్బర్ ఖాన్, ఓర్సు వెంకటేశ్వర్లు, పబ్బం మల్లేష్, నరేందర్ భల్ల, అంజద్ పాష, హరీష్ రెడ్డి, శ్రీకాంత్, యశ్వంత్, అమీత్, రాహుల్, ప్రవీణ్, వెంకటేష్, ఉదయ్, సందీప్ రెడ్డి, సికిందర్, ఇబ్రహీం, వసీం, వకీల్, రియాజ్, ధనలక్ష్మి, వరలక్ష్మి, రైసా, అనిత అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.