పేదలు, అనాథలకు ఆపద్భాందువు మలబార్ గోల్డ్ & డైమండ్స్

  • ఘనంగా ‘హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రోగ్రామ్’ ప్రారంభం
  • ఇకపై ప్రతిరోజూ 51,000 పోషకాహార ప్యాకెట్లు పంపిణీ
  • ఇంతకుముందు 31,000 ఆహార ప్యాకెట్లు పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి : ఆకలితో అలమటించే వారికి ఆపద్భాందవవుతున్నది మలబార్ గోల్డ్ & డైమండ్స్. ఇందులో భాగంగా ఎన్.జి.ఓ ‘థనల్ – దయా రిహాబిలిటేషన్ ట్రస్ట్’ సహాయంతో ఈ నెల 28న ‘హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రోగ్రామ్’ కి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథులు చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దంపతులు, స్థానిక ఇన్స్పెక్టర్ పాలవెల్లి స్టోర్ హెడ్ దీపక్ తో కలిసి ప్రారంభించారు.

దీంతో ‘ఆకలి-రహిత ప్రపంచం’ మరికొన్ని వేల మందికి చేరనున్నది. ఇంతకు ముందు 31,000 ఆహార ప్యాకెట్లు పంపిణీ జరిగేది. ప్రస్తుతం 51, 000 పోషకాహార ప్యాకెట్లు పంపిణీ చేయనున్నది. ఈ నేపథ్యంలో మలబార్ గ్రూప్, థనల్ వాలంటీర్లు వీధులు, పట్టణ శివారు ప్రాంతాలలో నిరుపేదలను గుర్తించి, ఆహార ప్యాకెట్లను వారి ఇంటి వద్దకే తీసుకెళ్లిస్తున్నారు.

మలబార్ గోల్డ్ & డైమండ్స్ తో సహా, మలబార్ గ్రూపులోని వివిధ వ్యాపార విభాగాల నుండి వచ్చే లాభాలలో ఐదు శాతాన్ని సామాజిక సేవ, సంక్షేమ కార్యకలాపాల కోసం కేటాయిస్తుండటం విశేశం. ఇప్పటికే 246 కోట్ల రూపాయలను మలబార్ గ్రూప్ ఖర్చు చేసింది. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీధర్, మలబార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here