- నాలుగు లక్షల చొప్పున ఇద్దరికీ మంజూరు
నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో ఈదురుగాలులు, భారీ వర్షం వల్ల ఇద్దరు మృతి చెందగా.. వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. నాలుగు లక్షల చొప్పున మంజూరు చేసింది.
డిప్యూటీ కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ వెంకారెడ్డి ఆదేశాల మేరుకు ఎక్స్ గ్రేషియాకు సంబంధించిన చెక్కును గిరిదావర్ ఆర్ల శీను (మూడేండ్ల చిన్నారి సమద్ కు సంబందించిన చెక్కును అతడి తండ్రి నస్సిముద్దీన్, ఎండీ రషీద్ చెక్కును అతడి భార్య ఆసియా బేగం) బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అంతకుముందు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ. 1లక్ష ఆర్థిక సాయం అందించిన విషయం మనకు తెలిసిందే.