నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పేట్ (109) డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో బతుకమ్మ పర్వదినం సందర్బంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుక ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని హఫీజ్ పేట్ – కాయిదమ్మ కుంట వద్ద నిర్వహించగా ముఖ్య అతిధిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎం ఎల్ ఏ మొవ్వా సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా మహిళా సోదరీమనులకు శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ పండుగను అందరు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని, తెలంగాణ పండగల్లో అత్యంత ప్రాముఖ్యత గలది దసరాతో మొదలై చిన్న బతుకమ్మతో సంబరాలు చేస్తూ, నవరాత్రులు జరుపుకుంటారని తెలిపారు.
బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానిక మహిళలు, బ్రహ్మకుమారీస్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.