- ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ గాంధీ
- మంగళహారలతో మహిళామణుల ఘన స్వాగతం
నమస్తే శేరిలింగంపల్లి: ఎన్నికల ప్రచారంలో భాగంగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలోని హనుమాన్ దేవాలయం, సాయిబాబా దేవాలయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి హుడా కాలనీ ఫేస్ 1, హుడా కాలనీ ఫేస్ 2, గంగారాం విలేజ్, శాంతి నగర్, సుభాష్ నగర్ కాలనీలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ ఇంటింటి ప్రచారం చేేేేపట్టారు.
అనంతరం ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో 9 వేల కోట్ల రూపాయల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గంను అభివృద్ధి చేశామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ కి శ్రీరామ రక్ష అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 ఏండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నట్లు ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, శ్రేయభిలాషులు పాల్గొన్నారు.