- పలు కాలనీలు , బస్తిలలో బి.ఆర్.ఎస్ , కాంగ్రెస్ పార్టీల నుండి బిజెపిలో చేరిక
- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ శాసన సభ్యులు బిక్షపతి యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: రోజురోజుకీ భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతుందని, అన్ని కాలనీలు, బస్తీల నుండి అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీలో చేరుతున్నారని మాజీ శాసన సభ్యులు బిక్షపతి యాదవ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ తెలిపారు. పలు కాలనీలు, బస్తిలలో బి.ఆర్.ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి బిజెపి పార్టీలో చేరగా.. వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అందరం కలిసి పనిచేద్దాం.. కాషాయ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు తెలంగాణలో కెసిఆర్ పరిపాలనపై ప్రజలకు విశ్వాసం పోయిందని, కాంగ్రెస్, బి.ఆర్.ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని ప్రజలకు అర్థమైందన్నారు. అందుకే పెద్ద ఎత్తున ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని, రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు.