మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలోని చెరువు పక్కన.. గుర్తుతెలియని పసికందు లభ్యం

నమస్తే శేరిలింగంపల్లి : అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు నిర్మానుష్య ప్రాంతంలో పడేసిన ఘటన మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ లో మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలోని చెరువు పక్కన ‌అప్పుడే పుట్టిన ( పాప) ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిపోయారు.

పాప గుక్క పెట్టే ఏడుస్తూ ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు 108 కు ఫోన్ చేసి శిశువును కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here