రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

  • రీజనల్ రింగ్ రోడ్డును త్వరలో తీసుకొస్తాం
  • ట్రైన్ సదుపాయం కల్సిస్తాం
  • అవగాహన లేకుండా సంతకాలు పెడితే ఆగమవుతాం
  • ఫైర్ సేఫ్టీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే సరైన ప్రణాళిక అవసరమని, తనకు కొంత సమయం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నానక్ రాంగూడలో ఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. గత ముప్పై ఏళ్లుగా హైదరాబాద్ నగరాన్ని మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ ఆర్, కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని, రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందన్నారు. హైదరాబాద్ కు ముందుగా ఔటర్ రింగ్ రోడ్డును చంద్రబాబు ప్రతిపాదన చేశారని, దాన్ని కొనసాగిస్తూ వైఎస్ ఆర్ పూర్తి చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డును త్వరలో తీసుకోస్తామని అలాగే రింగ్ రోడ్డు చుట్టూ ట్రైన్ సదుపాయం కూడా తీసుకు రాబోతున్నట్లు తెలిపారు.

ఫైర్ సేఫ్టీ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందేలా ప్లాన్ చేశామన్నారు. 2050 మెగా మాస్టర్ ప్లాన్ ద్వారా ముందుకు వెళ్తున్నామని, అర్బన్ తెలంగాణతో పాటుగా, రూరల్ తెలంగాణాను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. రాజకీయంగా తనకు అవగాహన ఉందని, ఆయా ప్రాజెక్టులు, అభివృద్ధికి సంబంధించి నిర్మాణ సంస్థలతో చర్చిస్తామన్నారు. అవగాహన లేకుండా అనుమతులు ఇస్తూ సంతకాలు పెడితే మాజీ హెచ్ ఎండీఏ డైరెక్టర్ బాలకృష్ణ పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ఫైర్ డిపార్ట్ మెంట్ అనేది కేవలం అగ్ని ప్రమాదాలు కోసమే కాదని విపత్కర పరిస్థితుల్లో కూడా వీరు సేవలు అందిస్తూ ఉంటారని గుర్తు చేశారు. ప్రాణాలు తెగించి అందరి ప్రాణాలు కాపాడడంలో ఫైర్ డిపార్ట్ మెంట్ కీలకంగా వ్యవహరిస్తుందని గుర్తు చేశారు. ఎన్నో వేలాది నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ఫైర్ డిపార్ట్ మెంట్ కి భవనం లేకపోవడం మంచిది కాదని అందుకే నూతన భవనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఫార్మాసిటీ కట్టలేదని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారని, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ పక్కన ప్రమాద డ్రగ్ తయారీ కంపనీ ఏర్పాటు సరైనది కాదన్నదే తమ ప్రభుత్వ నిర్ణయం అన్నారు. ఫార్మ్ సిటీలో మీరు ప్లాన్ చేస్తే మేము పల్లెలో ప్లాన్ చేస్తున్నామని బీఆర్ ఎస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


10 నుండి 15 విలేజ్ లో ఫార్మాను ప్లాన్ చేస్తున్నామని, ఒకే ప్రాంతంలో 25 వేల ఎకరాల్లో ఫార్మ తీసుకొస్తే నగరం అంత కలుషితం అవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రమాద సమయంలో మరణించినా వచ్చే బెనిఫిట్స్ అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ల లాగే ఫైర్ డిపార్ట్మెంట్ కు ఇస్తామని, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here