గొర్రె కాపర్ల సమస్యలపై పరిష్కరించండి

  • మంత్రి సీతక్కకు రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, రాష్ట్ర ముఖ్య గౌరవ సలహాదారు బేరి రామచందర్ యాదవ్, సంఘం నాయకుల వినతి పత్రం

నమస్తే శేరిలింగంపల్లి : రెండో విడత గొర్రెల పంపిణీలో డీడీలు కట్టి రెండు సంవత్సరాలు కావస్తున్న గొర్రె కాపరుల సమస్య పరిష్కారం కావడం లేదని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, గొర్రెల మేకల పెంపకం వత్తిదారుల సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారి బేరి రామచందర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి గొల్ల కాపరుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ పేద గొల్ల కురుమలు కొందరు పుస్తెలు తాకట్టు పెట్టి, మరికొందరు అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి గొర్రెలు మేకలు పంపిణీ చేస్తారనే ఆశతో ప్రభుత్వానికి డీడీలు కట్టారని తెలిపారు. గత ప్రభుత్వం వారికి రెండవ విడతలో గొర్రెలు మేకలు పంపిణీ చేయకపోవడమే గాక వారు కట్టిన డీడీలు సైతం తిరిగి చెల్లించకుండా వారిని కష్టాల్లోకి నెట్టారని మండిపడ్డారు. వీరికి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు ఆమెకు చెప్పారు.  బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ పేద కురుమ గొల్లలకు తొందరగా గొర్రెలు ఇప్పించాలని, లేదా డీడీలు తిరిగి ఇప్పించాలని కోరారు. బీసీ ఐక్యవేదిక యూత్ అధ్యక్షులు అందెల కుమార్ యాదవ్ మాట్లాడుతూ డీడీలు కట్టిన యాదవులకు కురుమలకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి డీడీలు కట్టిన గొల్ల కురుమలకు తగిన న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం నాయకులు మంత్రి సీతక్క గారికి పుష్పగుచ్చం ఇస్తూ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షులు గజ్జి రమేష్ యాదవ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఆవుల రాజు యాదవ్, మంచిర్యాల జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కాటవేణి మహేష్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు సాయన్న ముదిరాజ్, బీసీ యూత్ అధ్యక్షులు కుమార్ యాదవ్ , బీసీ నాయకులు, గొల్ల కురుమల సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here