నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ లక్ష్మీ నగర్ కాలనీలో నూతనంగా ఎన్నుకోబడ్డ అభివృద్ధి, సంక్షేమ సంఘ సభ్యుల శిలాఫలకాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం పాదయాత్ర నిర్వహించి కాలనీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మియాపూర్ డివిజన్ లక్ష్మీ నగర్ కాలనీలో నూతనంగా ఎన్నుకోబడ్డ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాలనీ సమస్యలపై ప్రభుత్వాల, అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని, తద్వారా అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ లక్ష్మీ నగర్ లో నెలకొన్న కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని వాటిని వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి మార్గం చూపుతానని తెలిపారు.
- కాలనీ నూతన కార్యవర్గం..
కాలనీ అధ్యక్షుడిగా నరసింహారాజు, ఉపాధ్యక్షులుగా సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, జాయింట్ సెక్రెటరీ గోపాల్, ట్రెజరర్ శ్రీనివాసరెడ్డి, అడ్వైజర్లుగా పట్నాయక్, శ్రీనివాస్, మల్లేశ్వరరావు, సత్యనారాయణ ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ ,పవన్ యాదవ్, ప్రభాకర్, మంజుల, నాగులు ,సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.