ట్రా‘ఫికర్’ ఉండదిక

  • గోపన్ పల్లి తండా చౌరస్తా వద్ద ఘనంగా ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం
  • రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
  • మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీలతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి తండా చౌరస్తా వద్ద రూ. 28 కోట్ల 50 లక్షల అంచనావ్యయంతో నిర్మించిన నూతన ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఫ్లై ఓవర్ ను మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేమునరేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శాంశక, తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్ రెడ్డి రామిరెడ్డి, తెలంగాణ ఎంబీసీ చైర్మన్ జేరిపేటి జైపాల్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, హమీద్ పటేల్, దొడ్ల వెంకటేష్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, ఆర్& బీ స్పెషల్ సెక్రటరీ హరిచందన, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, డీసీ రజినీకాంత్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని మాట్లాడారు. ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

గోపన్ పల్లి తండా చౌరస్తా వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రులకు, ప్రజాప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు. ప్లై ఓవర్ నిర్మాణంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి, అధికారులకు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హెచ్సీయూ బస్ స్టాండ్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు వయా వట్టినాగుల పల్లి మీదుగా నిర్మిస్తున్న రేడియల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ప్రజల సౌకర్యార్థం, ట్రాఫిక్ రహిత సమాజం కోసం గోపన్ పల్లి తండా వద్ద ఫ్లై ఓవర్ ను నిర్మించినట్లు పేర్కొన్నారు. ఫ్లై ఓవర్ వివరాలను వెల్లడించారు.

జెండా ఊపి ఫ్లై ఓవర్ పై గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ..

గౌలిదొడ్డి నుండి ఒకవైపు( వన్ వే) ట్రాఫిక్ తరహాలో నిర్మించారని, గౌలి దొడ్డి నుండి నల్లగండ్ల వైపు 430 మీటర్లు పొడవు ఉందని, గౌలిదొడ్డి నుండి తెల్లాపూర్ వైపు 550 మీటర్ల పొడవు , 11.5 మీటర్ల వెడల్పుతో ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. గోపన్ పల్లి, నల్లగండ్ల, లింగంపల్లి, తెల్లాపూర్, ఉస్మాన్ సాగర్ పరిసర ప్రాంతాలు, గేటెడ్ కమ్యూనిటీలకు, కాలనీలకు, చుట్టుపక్కల గ్రామాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఆర్& బీ అధికారులు సీఈ మోహన్ నాయక్, ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఈఈ మధుసూదన్, డీఈ సీతారామయ్య, ఏఈ అజయ్ కుమార్ జీహెచ్ఎంసీ అధికారులు ఎస్ఈ శంకర్ నాయక్, ఈఈ శ్రీనివాస్, డీఈ రమేష్, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here