నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో కొనసాగుతున్న వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు నిత్యం అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా గురు పౌర్ణిమ పురస్కరించుకొని కందుల కూచిపూడి నాట్యాలయం నాట్య గురు రవి కూచిపూడి శిష్య బృందం కూచిపూడి నాట్య “గురు వందన” నిర్వహించారు. శ్లోకాలు, జతులు, మూషిక వాహన, పుష్పాంజలి, నమశ్శివాయతేయ్, బ్రహ్మాంజలి, పలుకే బంగారమయేహ్న, శివ స్తుతి, రామాయణ శబ్దం, వచ్చెను అలమేలు, కృష్ణం కలయసఖి, నారాయణీయం, వినరో భాగ్యము, జయము జయము, తిల్లాన అంశాలను ప్రదర్శించారు. పూజ్య నాట్య గురువులు ఉత్సాద్ బిస్మిల్లాహ్ ఖాన్ శ్రీ వేదాంతం సత్య నరసింహ శాస్త్రికి దాదాపుగా రెండు వందల మంది కళాకారులతో గురువందన నిర్వహించారు.
గురువుకి పాదపూజ చేసి ఘనంగా సత్కరించారు. హిందూ సేవ సమితి రాధా కృష్ణ, నాట్య గురువులు కొక విజయలక్ష్మి, డాక్టర్ పేరిణి రవి తేజ, జానపద సంగీత గాయకులు విద్యారణ్య చారి ముఖ్య అతిథులుగా విచ్చేసి కళాకారులను అభినందించారు.