- మాదాపూర్ డివిజన్ స్థలాల పరిష్కారం కోసం సుప్రీంకోర్టులో పోరాడుతాం..
- మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో ఉత్సాహంగా ఇంటింటా ప్రచారం
నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి జగదీష్ అన్నను గెలిపించాలని, కార్పొరేటర్ ఎన్నికలలో మమ్మల్ని ఆదరించారని ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా గెలిపించే బాధ్యత మాదాపూర్ డివిజన్ ప్రజలపై ఉందని కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు.
అవినీతి మచ్చలేని నాయకుడిగా.. మీ ఇంటి బిడ్డగా ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో కూడా మాదాపూర్ డివిజన్ ప్రజలకి జగదీశ్వర్ గౌడ్ అందుబాటులో ఉన్నాడని, మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ని గెలిపించాలని ఆయన సతీమణి కార్పొరేటర్ పూజిత గౌడు వేడుకున్నారు.