శేరిలింగంపల్లి, జూలై 29 (నమస్తే శేరిలింగంపల్లి): గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలోని శ్రీ షిర్డీ సాయినాథ, మార్కండేయ స్వామి, సంతాన నాగదేవత ఆలయాల్లో మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్‌పర్సన్ సుజాత యాదవ్, రాగం నాగేందర్ యాదవ్ సొంత నిధులతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ గురువుల ఆశీస్సులతో ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే శేరిలింగంపల్లి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు చెప్పారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి దేవి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.






