కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన మొవ్వ సత్యనారాయణ

  • బిజెపిని వీడి, బీఆర్ఎస్ లో చేరిక

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మొవ్వ సత్యనారాయణ నాయకులు, కార్యకర్తలు యువకులు బిజెపిని వీడిన విషయం తెలిసిందే. నేడు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి  కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మొవ్వ సత్యనారాయణకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ప్రభుత్వ విప్ గాంధీ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన బిజెపి సీనియర్ నాయకుడు మొవ్వ సత్యనారాయణను ఆహ్వానిస్తున్న మంత్రి కేటీఆర్

అనంతరం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ  మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంను ఎంతగానో అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని, ఇందులో భాగస్వాములు అయ్యేందుకు చేరికలుు అధికమవుతున్నాయని, ఈ నేపథ్యంలో బిజెెెపి సీనియర్ నాయకుడు మొవ్వ  సత్యనారాయణ నేడు పార్టీలో చేయడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.

పార్టీలో చేరిన వారితో..

బీఆర్ఎస్ పార్టీలో చేరిన ముఖ్య నాయకులు టిఎన్ఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కార్పొరేటర్ పోటీదారు తన్నీరు ప్రసాద్, టీడీపీ మాదాపూర్ జనరల్ సెక్రటరీ భవాని, మాదాపూర్ కాపు సంగం నాయకులు కరుణాకర్, డిఎస్ఆర్కె  ప్రసాద్, రమేష్., మట్ట సురేష్ గౌడ్, లీలా ప్రసాద్, చిట్టా రెడ్డి ప్రసాద్, తన్నేరు ప్రసాద్, రమేష్, భవాని, నవీన్ చౌదరి, సువర్ణ, దుర్గా, పవన్ కుమార్, కోడెల ప్రసాద్, సత్యనారాయణ, ప్రశాంత్, గిరి, శ్రీధర్, కిలారి ప్రసాద్, రామ్ సుబ్బా రెడ్డి, తౌఫీక్, లతీఫ్, పుల్లారావు, గోపి కృష్ణ, మురళి, ఉపేందర్, కృష్ణకాంత్, వెంకట్ వారి అనుచరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ , గోపి కృష్ణ, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here